సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, గురువారం భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ 17,63,142 ల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని, ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో 542 మందికి రూ 4,52,66,121 లను అందించామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *