సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 5వ రాష్ట్రస్థాయి మూగ చెముడు టీ20 క్రికెట్ ఛాంపియన్ షిప్ పోటీల బ్రోచర్ ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 5వ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను భీమవరంలో రెండు రోజులపాటు నిర్వహించడం అభినందనీయమని, ఇటీవల మూగ చెముడు గలవారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్నారని, పోటీలకు నా వంతు సహకారం అందిస్తామని అన్నారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూపతిరాజు మురళీ కృష్ణంరాజు, సిహెచ్ తాతారావు మాట్లాడుతూ.. ఈనెల 12, 13 తేదీల్లో భీమవరం DNR గన్నాబత్తుల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని, రాష్ట్ర నలుమూలల నుంచి 10 టీమ్ లు పాల్గొంటున్నాయని, డిఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సత్యనారాయణ రాజు మరియు దాతలు క్రీడా అభిమానుల సహకార సౌజన్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. గతంలో నాలుగు సార్లు భీమవరంలోనే పోటీలను నిర్వహించామని, అన్నారు.
