సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం – పెద అమిరం లోని మాజీ ఎంపీ గోకరాజు గంగ తాతరాజు ప్రాంగణంలో ఈనెల 29వ తేదీ నుంచి నవంబర్ 2 వరకు 108 కుండముల జ్ఞాన గాయత్రీ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో నేటి సోమవారం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజులపాటు జరిగే మహాయజ్ఞ పోస్టర్ ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణ, లోక శాంతి కోసం యజ్ఞ యాగాదులు పురాతనకాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా గాయత్రీ మహా యజ్ఞం మన ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. గాయత్రీ పరివార్ యజ్ఞ కన్వీనర్ రమేష్ వర్మ, కమిటీ సభ్యులు నడింపల్లి బంగార్రాజు, చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, రాష్ట్ర కన్వీనర్ రఘురాం (హైదరాబాద్) మాట్లాడారు. నవంబర్ 1న జ్ఞాన గాయత్రీ మహా యజ్ఞం, మధ్యాహ్నం డిఎన్నార్ కళాశాల నుంచి యజ్ఞ స్థలం వరకు పర్యావరణ పరిరక్షణ గ్రామ ప్రదక్షణ, సాయంత్రం 6.30 గంటలకు సామూహిక శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, 2వ తేదీన గాయత్రీ సాధన దీక్ష, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *