సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : నేడు, మంగళవారం ఉదయం భీమవరం పట్టణంలోని స్థానిక 6వ వార్డ్ మరియు 7వ వార్డులలో పకృతి ఆశ్రమం దగ్గర, ప్రభుత్వ విప్ , స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు కోట్లాది ప్రభుత్వ నిధులతో చేపడుతున్నామని, ఇప్పటికే చాల రోడ్డులు పూర్తీ చేశామని, ఇప్పుడు శంకుస్థాపన చేసిన రోడ్డులు కూడా మంచి క్వాలిటీ తో శరవేగంగా పూర్తీ చేస్తామని, రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఒక మోడరన్ నగరంలా సీఎం జగన్మోహనరెడ్డి సహకారంతో జిల్లా కేంద్రం భీమవరం ను అభివృద్ధి పరుస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, స్థానికులు , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు
