సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఉప్పాడ రవి ప్రకాష్ IPS వారి యొక్క ఆదేశాలపై భీమవరం DSP బి త్రినాధ్ యొక్క ఆధ్వర్యం లో భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్. B కృష్ణ కుమార్ భీమవరం CCS ఇన్స్పెక్టర్ , A రఘుకు అందిన సమాచారంపై భీమవరం 2 టౌన్ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ ఐ లు P అప్పారావు, V రాంబాబులు మరియు వారి సిబ్బందితో కలసి గత శుక్రవారం రాత్రి (09.12.2022 వ తేది ) భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పట్టణ పరిధిలోని PAR కాంప్లెక్స్ నందు 2nd floor లో A9 బ్యూటీ సెలూన్ & స్పా భీమవరం నందు దాడులు నిర్వహించగా మహిళల ద్వారా వ్యభిచారం చేయించి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్న సెక్స్ రాకెట్ గుట్టు బట్టబయలు అయ్యింది. దీనిలో , అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న మొత్తం 3గురు నిందితులలో ఒక వ్యక్తి అక్కడి నుండి పరారీ కాగా నిందితులు మిగతా ఇద్దరినీ A1 & A3 లను పట్టుకొని వారి వద్ద నుండి నగదు Rs. 31,500/- రూపాయలు, 13 స్మార్ట్ టచ్ ఫోన్ లను, HDFC వారికి చెందిన Swaiping మెషిన్ ను, HDFC చెక్ బుక్ ను, మరియు 20 కండోమ్ పాకెట్స్ లను స్వాధీనం చేసుకొన్నట్లు 2 టౌన్ పోలీసులు మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. వ్యభిచారం కోసం తీసుకువచ్చిన 7 గురు మహిళలను ముద్దాయిల బారి నుండి రక్షించినట్లు తెలిపారు. A1 & A3 అదుపులోకి తీసుకోని వారిపై భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr.No.354/2022 __U/s 370(3) 370(A), (2) r/w 34 IPC and Sec 4,5,6 ITP Act-1956 ప్రకారం కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.
