సిగ్మాతెలుగు డాట్ ఇన్,న్యూస్:ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేడు, శనివారం భీమవరం టౌన్ హాల్ నందు ప్రారంభమయ్యాయి. రేపు ఆదివారం కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రెసిడెంట్ ప్. కోటేశ్వర రావు మరియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి దక్షిణామూర్తి తదితరులు సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మెడికల్ రిప్రజెంటీటివ్స్ సంఘం కేవలం మెడికల్ రిప్రజెంటీటివ్స్ ఉద్యోగ భద్రత కోసమే కాకుండా వైద్య ఆరోగ్య రంగంలో సమస్యల పై గత 55 సంవత్సరాలుగా పోరాడుతూ పలు సమస్యలకు పరిష్కారం సాధించేలా పని చేసిందని తెలియజేశారు.ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునరుద్ధరించాలని, మందుల మరియు వైద్య పరికరాల పై జిఎస్టిని ఎత్తివేయాలని, జాతీయ జిడిపిలో కనీసం 5 శాతం నిధులను కేటాయించి వైద్య సదుపాయాలను దేశంలో అందరికీ అందుబాటులో ఉండాలని, నిత్యవసర మరియు అత్యవసర మందుల ధరలను తగ్గించాలని, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని మొదలైన డిమాండ్స్ ను తెలియజేశారు.మెడికల్ రెప్రజెంటివ్స్ కు వర్తించే sales promotion employees act (1976) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.బహుళ జాతి సంస్థ మెడికల్నుసంస్థలు మెడికల్ రెప్రజెంట్స్ ను అన్యాయంగా తొలగిస్తున్నారు. ఇటీవల ఈ సమస్య భయంకరంగా పెరిగింది. మెడికల్ రిప్రెసెంటేటివ్ల తొలగింపును పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.చట్ట ప్రకారం మెడికల్ రిప్రజెంటీటివ్ లకు form A రూపంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేసారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *