సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: జాతీయ B C సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోఈరోజు మధ్యాహ్నం భీమవరం మార్కెట్ యార్డ్ గ్రౌండ్లో జరిగిన కార్తీక వన సమరాధన కార్యక్రమానికి, విశేషంగా జిల్లా స్థాయి బిసి సంగాల నేతలు పాల్గొన్నారు, జాతీయ బిసి నేత, వైసిపి పార్టీ నుండి రాజ్య సభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు, వేండ్ర వెంకటస్వామి, కామన నాగేశ్వర్ రావు, కోడెయుగాంధర్ , గూడూరి ఉమాబాల మేకా పార్వతి, మేడిది జాన్సన్, ఎండీ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఇక టీడీపీ నుండి మెఱగాని నారాయణమ్మ, మామిడిశెట్టి ప్రసాద్, బీజేపీ నుండి పాక సత్యనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం 139 బిసి కులాల ఉన్న బిసిల ఐక్యత కోసం పాటు పడాలని , అటు వ్యాపార రంగంలోనూ, ఇటు ఏ రాజకీయ పార్టీలో ఉన్న ప్రతిభావంతమైన పాత్రను బిసిలు పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు, ఈసందర్భంగా కొయ్యే మోషేనురాజు మాట్లాడుతూ.. సామాజిక అభివృద్ధిలో BC లు కీలకపాత్ర పోషిoచారని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే Dr B R అంబెడ్కర్ లు ఎంతగానో కృషి చేశారని ఆయన అన్నారు.తెలంగాణ నుండి వచ్చిన బిసి కళాకారుల పాటలు ఆహుతులను అలరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *