సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని బివి రాజు ఫౌండేషన్ ఆద్వర్యంలోని విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ లోని డెంటల్ కాలేజీ కి ఒక ఆగంతకుడు మెయిల్ ద్వారా కాలేజీ లో బాంబు పెట్టినట్లు సమాచారం పంపడంతో కళాశాల నిర్వాహకులు ఆందోళనకు గురి అయ్యి వెంటనే పోలీసులకు పిర్యాదు చెయ్యడంతో వెంటనే బాంబ్ స్వాడ్ నిపుణులను కాలేజీకి తీసుకోని వచ్చి అన్ని గదులను చుట్టుప్రక్కల ప్రాంతాలను జల్లెడ పట్టడం జరిగింది. దేశంలోనే ప్రముఖ డెంటల్ కాలేజీగా ప్రతిష్ట ఉండటంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో విష్ణు డెంటల్ కాలేజీ లో దంత వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికి వరకు అందిన సమాచారం ప్రకారం కాలేజీ లో ఎటువంటి బాంబ్ దొరకలేదు. ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. అసలు ఎవరు దేనికోసం ఇలా బెదిరింపుకు పాల్బడ్డారో పోలీస్ దర్యాప్తు లో వెల్లడి కావాల్సి ఉంది.
