సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ Dr BR అంబేద్కర్ గారి వర్థంతి సందర్భంగా నేడు, శుక్రవారం భీమవరం ప్రధాన అంబెడ్కర్ చౌక్ సెంటర్ లో గల అంబేద్కర్ గారి కాంస్య విగ్రహం కు పుష్పమాల వేసి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఘన నివాళులు అర్పించారు.తదుపరి మందలపర్రు గ్రామం లో మాజీ TTD బోర్డ్ సభ్యులు, మందలపర్రు సుబ్బరాజు నూతనంగా ఏర్పాటు చేసిన Dr.BR అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొయ్యే మోషేను రాజు ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవల గురించి , ఆయన దేశ సార్వభౌమతం కోసం , దేశంలో అన్ని వర్గాల ప్రజల సమాన అభివృద్ధి కోసం కోసం ముందుచూపు తో చేపట్టిన చట్టాల గురించి సభికులకు వివరించారు.
