సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఉదయం డియన్ఆర్ కళాశాల గన్నాబత్తుల వారి క్రీడా ప్రాంగణంలో డిఎన్ఆర్ వాకర్స్ తో తెలుగునాట ఎన్నోప్రజా పోరాటాలు చేసిన సుప్రసిద్ధ సీనియర్ కామ్రేడ్, కేంద్ర సిపిఎం పార్టీ పాలిటిబ్యూరో సభ్యులు బివి రాఘవులు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. మనిషికి ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరం అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారతదేశం గుర్తించబడినప్పటికీ మానవ వనరులు ఉన్నప్పటికీ దేశం ఉత్పత్తిలో వెనుకబడి ఉందన్నారు.. సమాజం ఆరోగ్యానికి వ్యాయామానికి ఎక్కడ ప్రాధాన్యత నిస్తుందో అక్కడ ఉత్పత్తి పెరుగుతుందని అన్నారు. మనిషి ఆరోగ్యకరమైన ఆకృతిని పొందడానికి వ్యాయామం అవసరమన్నారు.. నడక అన్నది ప్రత్యేక కార్యక్రమం కాదని ఈ రోజుల్లో, నేటి యాంత్రిక జీవనములో వ్యాయామం కోసం ఆరోగ్యం కోసం నడక ను వ్యాపకంగా చేసుకోవాల్సి వచ్చిందన్నారు. నేడు పాఠశాలల్లో కళాశాలలో క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు..చావుకు భయపడకూడదు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బతకాలని బాగా బతకాలని అన్నారు.. పురుషులతో పాటు మహిళలకు కూడా నడక అవసరమన్నారు.ఆయనతో పాటు సిపిఎం రాష్ట్ర నాయకులు బి.బలరాం, జిల్లా సిపిఎం ప్రెసిడెంట్ బిఎన్ గోపాలన్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డి యన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్, మార్నింగ్ కాఫీ క్లబ్ లు బివి రాఘవులు ను సత్కరించాయి…
