సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం లో దంతులూరి నారాయణరాజు కళాశాల.. స్వాతంత్య్రానికి పూర్వము నుండి అనేక దశాబ్దాలుగా ప్రతిష్టాకర కాలేజీ గా ఇప్పటికి ఎయిడెడ్ కళాశాలగా కూడా ఆధునిక వసతులు, కొత్త కోర్స్ లతో ఖ్యాతి గాంచిన DNR కళాశాలలో ఈ రోజు ఉదయం 11 గంటలకు 2,4 మరియు 6 సెమిష్టర్ల డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలను కళాశాల పాలకవర్గ ఉప అధ్యక్షలు, గోకరాజు పాండు రంగరాజు రాజు మరియు సెక్రటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు) విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .. లాభాపేక్ష లేకుండా విద్యా బోదనే తమ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎందరో మేధావులను ఈ కళాశాల సమాజానికి అందించిన ఘనత తమ కళాశాలకు ఉందని అన్నారు. డి.యన్.ఆర్ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్దులలో 70 శాతం కు పైబడి వారిని పేరొందిన వివిధ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించడమైనది అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి మాట్లాడుతూ .. ఈ పరీక్ష ఫలితాలు తమ కళాశాల వెబ్ సైట్ www.dnrcollege.org లో కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రోజు విడుదల చేసిన డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలలో బి.ఎ 78 శాతం, బి.యన్.సి 64 శాతం, బి.కాం 70 శాతం మరియు బి.వోక్ 57 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాదించారని అన్నారు రీవ్యాల్యూషన్ పరిశీలనకు విద్యార్ధులకు సెప్టెంబర్ 4 నుండి 8వ తారీకు వరకూ అవకాశం కల్పించబడినది అని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *