సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో దశాబ్దాలుగా తెలుగునాట ప్రతిష్టాకర విద్యాసంస్థ గా పేరొందిన దంతులూరి నారాయణరాజు కళాశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నేడు, గురువారం స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాల 79 వ వ్యవస్దాపక దినోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్బంగా కళాశాల ఆవరణలో గల దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహానికి, మరియు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భముగా ఆయన విగ్రహానికి కూడా కళాశాల అసోసియేషన్ అద్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు పూల మాలలు వేసి వారికీ ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రానికి పూర్వం లాభా పేక్ష లేకుండా నాణ్యమైన ఉన్నత విద్యను భీమవరం మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారికి అందించాలనే సదాసయంతో ధార్మిక వేత్తలు , మేధావులు ఈ కళాశాలను ప్రారంబించారని తెలియజేసారు. వారి ఆశయలకు లోబడి నేటి వరకూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరియు విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో అనేక కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నామని తెలియజేసారు. మన ప్రాంతంలో జన్మించి స్వతంత్ర సంగ్రామ యోధుడు సీతారామరాజు గారి పుట్టిన రోజునే డి.యన్ ఆర్ కళాశాలను స్థాపించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని ఆయన ఆశయాల స్ఫూర్తి తో మన కాలేజీలో పనిచేసే సిబ్బంది, విద్యార్థులు పని చెయ్యాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలోప్రిన్సిపాల్, జి .మోజెస్ ,పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు , సంయుక్త కార్యదర్శి కె.రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ కె.శివరామరాజు, ట్రెజరర్ కె.వి.యస్.నారాయణ పాలకవర్గ సభ్యులు అధ్యాపక అద్యాపకేతర సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు
