సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించ తలపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరం పురపాలక సంఘం పరిధిలో e-CHECK ఇతివృత్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ప్రజలకు అవగాహన కల్పించుటకు ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించుటకు 4వ డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ వారి, 27 వ వార్డు నందు జిల్లా కలెక్టర్ నాగరాణిమరియు పురపాలక సంఘ కమిషనర్ రామచంద్ర రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయని యెడల కలుగు అనర్థాల గురించి ప్రజలకు అధికారులు వివరించడం జరిగినది మరియు సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది మరియు విద్యార్థులతో అవగాహన ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది మరియు ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ చేయుటకు e- మీ వ్యర్ధాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది సదరు కేంద్రాల ద్వారా 250 కేజీల ఈ e- వ్యర్ధాలను సేకరించి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *