సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో మెంటేవారి తోట నుండి బై పాస్ రోడ్డు సమీపంలో ఉన్న గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే రోడ్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి అని భీమవరం ఎస్ ఎఫ్ ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కళాశాల నుండి స్థానిక MRO ఆఫీస్ వరకు విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ .. శ్రీ గ్రంధి వెంకటేశ్వరరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 250 మంది విద్యార్థులచదువుతున్నారని, జిల్లాలొనే మంచి పేరు ఉన్న ఈ కళాశాల కు ఇప్పటివరకు రోడ్ లేకపోవడం చాలా దారుణం అని అన్నారు. వర్షాకాలం కావడం తో వర్షాలు కారణం గా మోకాళ్లు లోతు బురదలో విద్యార్థిని, విద్యార్థులు నడుచుకుంటూ వెళుతున్నారు అన్ని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో ర్యాలీ గా వెళ్లి MRO ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేశారు. ఎం ఆర్ ఓ కు విన్నతి పత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్లాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించడం తో అక్కడ నుండి విద్యార్థులు వెళ్లారు.. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *