సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు సంతాప సభలు పట్టణంలో పలుచోట్ల జరుగుతున్నాయి. భీమవరం హోసింగ్ బోర్డు కాలనిలో ఆదిత్య కళ వేదికలపై స్థానిక కళాకారుల సంఘం ఫోకస్ సంస్థ , గన్నాబత్తుల మలేశ్వర రావు, తోట బొగ్గయ్య ల ఆధ్వర్యంలో జరిగింది. సభలో వక్తలు గ్రంధి వెంకటేశ్వర రావు దాత కళాకారుల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడి నివాళ్లు అర్పించారు. ఇక నేడు, మంగళవారం భీమవరం గునుపూడిలో గంటా రాజ్ కుమార్ ట్రస్ట్ అధ్వర్యంలో గ్రంధి వెంకటేశ్వరరావు కు సంతాపం తెలుపుతూ వారి జ్ఞాపకార్థం 20 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనంద దాయకమని వక్తలు, గూడూరి ఉమా బాల,,ఏఎస్ రాజు అన్నారు. గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ మొత్తం 3 వేల కుట్టు మిషన్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పడు స్వర్గీయ జీవియర్ పేరిట 20 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించమని తెలిపారు. కార్యక్రమంలో గంటా సుందర కుమార్, చెరుకువాడ రంగ సాయి, విజ్జురోతి రాఘవులు, సత్యనారయణ, నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
