సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం DNR కళాశాలలోని గన్నాబత్తుల పెద్దతాత గ్రౌండ్ లో రాష్ట్ర అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ నియోజకవర్గాలనుండి వచ్చిన క్రికెట్ ఆటగాళ్లతో కరచాలనం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో DNR కళాశాల పాలకవర్గం సభ్యులు మరియు, కార్యదర్శి గాదిరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగ రాజు పాల్గొన్నారు. నేటి ఉదయం ఉండి ఎమ్మెల్యేగా రఘురామా బిజీ షెడ్యూలు లో కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పెదమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” ను నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి, మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం “ముఖ్యమంత్రి సహాయ నిధి” నుండి మంజూరైన రూ. 14,14,058/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను 31 మంది లబ్ధిదారులకు అందజేశారు.
