సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం లో నేటి సోమవారం ఉదయం ఉదయం గునుపూడి లో ప్రాంతంలో జరిగిన మాజీ ముఖ్య మంత్రి కీ. శే. Y. S. రాజ శేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు ముఖ్యఅతిధి గా పాల్గొని YS రాజ శేఖర్ రెడ్డి గారి భారీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద మహిళలకు వస్త్ర దానంలో పాల్గొన్నారు. తదుపరి అయన మీడియా తో మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు గర్వముగా చెప్పుకొనే మహానేత వై యస్ అన్నారు. అయన చేప్పట్టిన ప్రజా సంక్షేమాలు దేశ రాజకీయాలుకు మార్గదర్శకాలుగా ఇప్పటికి ప్రజలలో బలమైన ముద్ర వేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఏ ఎస్ రాజు మాజీ సర్పంచ్ బోకూరి విజయ రాజు , జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు నర్సింహ స్వామి YSR సేవాదళ్ జిల్లా అధ్యక్షులు శ్ర బలే యేసు బాబుగా తదితరులు పాల్గొన్నారు.
