సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, భుధవారం స్థానిక త్యాగరాజ భవనంలో వై ఎస్ ఆర్ ఆసరా పధకం ఈ ఏడాది నిధులు విడుదల కార్యక్రమంలో విశేషంగా హాజరైన ఆసరా పధకం మహిళా లబ్ధిదారుల సభలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసారు. జ్యోతి ప్రజ్వలనం లో నరసాపురం వైసిపి పార్టీ ఇంచార్జి గూడూరి ఉమాబాల, భీమవరం ఎంపీపీ నరసింహరాజు , పట్టణ వైసిపి అడ్జక్షులు తోట బోగయ్య మరియు జడ్పీటీసీ, ఎంపీటీసీ , స్థానిక వైసిపి నేతలు, మహిళా నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా పక్ష పాతిగా సీఎం జగన్ అన్నింటా మహిళలకు పెద్దపీట వేశారని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నో సంక్షేమ పధకాలు కు వచ్చే నిధులను ప్రతి ఇంటా మహిళల బ్యాంకు ఎకౌంట్ లోనే నేరుగా వేస్తున్నారని, ఎన్నో పధకాల నిదులల్తో పాటు మహిళలకు కులం మతం చూడకుండా వారికీ స్వయం ఉపాధిగా ఇస్తున్న ఈ వైఎస్సార్ ఆసరా నిధులు గత నాలుగు ఏళ్లుగా వారి కుటుంబాలకు ఎంత చేదోడుగా నిలిచాయో లబ్ది పొందిన ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకొని సీఎం జగన్ సర్కార్ కు వచ్చే ఎన్నికలలో అండగా నిలవాలని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *