సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ అంటేనే భీమవరం.. మరి ఇక్కడకు వచ్చే అతిధులకు సంక్రాంతి వేళ రాష్ట్రంలో ఎక్కడ చూడని ఎన్నో రుచులు తో ఆహ్లాదం గా కుటుంబ సమేతంగా ఆహ్వానించే రెస్టారెంట్స్ హోటల్స్ ఆతిధ్యానికి కొదవ లేదు.. అయితే నిజంగా సరికొత్త రుచులతో పాటు సరికొత్త అనుభూతి ఆహ్లదం కలిగించాలనే ఉద్దేశ్యంతో నేడు, శనివారం ప్రముఖ బ్రాండ్ ZAZU రెస్టారెంట్ ను స్థానిక జేపీ రోడ్డు లో ఉన్న బాపిరాజు ప్లాజా లో ( KFC పైన ) సరికొత్తగా ప్రారంభించారు. ముఖ్య అతిధిగా రాష్ట్ర శాసనమండలి చైర్మెన్, కొయ్యే మోషేను రాజు హాజరయ్యారు. ఎప్పుడు సరికొత్త అభిరుచులు కోరుకొనే భీమవరం ప్రాంత యువత ను ఆకట్టుకొనేలా ZAZUలో ఏర్పాటు చేసిన ‘కౌబాయ్ మండి ‘ ప్రత్యేక జోన్ విశేషంగా ఆకట్టుకొంటుంది. అక్కడ అన్ని కౌబాయ్ వాల్ బొమ్మల రియల్ పెయింటింగ్స్ తో, ప్రత్యేక లైటింగ్, కుర్చీలకు బదులు ‘మండి సిటింగ్’ తో పాటు ఎన్నో సరికొత్త వెజ్ అండ్ నాన్ వెజ్ రుచులను పరిచయం చేస్తున్నారు. ఇంకా జాజు లో కాపీ కేఫ్ కూడా ఏర్పాటు చేసారు. ఇంకా కుటుంబసమేతంగాను, ఆఫీస్ , తక్కువ సంఖ్యతో కాలేజీ మేట్స్ పార్టీలకు అనువుగా రౌండ్ టేబుల్ సిటింగ్ ఏర్పాటు చేసారు. దీనికి బయట గ్లాస్ నుండి జేపీ రోడ్డు, నగర అందాలను వీక్షిస్తూ ఐటమ్స్ ను , కేఫ్ లో రుచులను ఆస్వాదించి సౌకర్యం కూడా ఉంది. ఇక్కడే ఐస్ క్రీమ్ రుచులకు ఐస్ బర్గ్ జోన్ అదనపు బోనస్. విభిన్న అభిరుచితో ZAZU ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులు
