సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం 1 కోటి 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ముందుగా నరసయ్య అగ్రహారంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర 5,6 వార్డుల ప్రజల కోసం 60 లక్షలతో 12 లక్షల లీటర్ల మంచినీటి సర్వీస్ రిజర్వాయర్‌కు సంబంధించిన పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేశారు.స్వచ్ఛ భారత్ లో భాగంగా పచ్చదనం.. పరిశుభ్రత అధిక సేవలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లో మొక్కలు నాటి ప్రారంభించారు. …తదుపరి 2 టౌన్ లోని 29,30,31 వార్డులకు సంబంధించి బీసీ కాలనీ పాకావారి వీధిలో 12 లక్షల లీటర్ల సర్వీస్ రిజర్వాయర్‌కు సంబంధించి రూ. 1 కోటి 20 లక్షలు నిధులతో పైప్‌లైన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసారు. ..ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, వైసిపి నేతలు పాల్గొన్నారు.
