సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో అంబేద్కర్ చౌక్ వద్ద నుండి నిర్మించిన రైల్వే రోడ్ అండర్ బ్రిడ్జ్ ను కేంద్రపార్లమెంటరీ మరియు సహాయ మంత్రి V. మురళీ ధరన్ నేటి, శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు మరియు రాష్ట్ర బీజేపీ అడ్జక్ష్యుడు సోము వీర్రాజు , రాజ్యసభ సభ్యులు GVL నర్సింహ రావు, భూపతి రాజు శ్రీనివాస వర్మ , రైల్వే అధికారులు పాల్గొన్నారు. రైల్వే అండర్ టర్నల్ పాస్ ను కేంద్ర మంత్రి మురళీ ధరన్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి మురళీ ధరన్ మాట్లాడుతూ.. అల్లూరి సీతారామ రాజు పుట్టిన పుణ్య భూమిలో అడుగిడినందుకు , ఇక్కడ భీమవరం ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు రైల్వే అండర్ పాస్ బ్రీజ్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు . ఇక్కడ జాతీయ రహదారి అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ మార్గం సుగమం అవుతుంది. నరేంద్ర మోడీ పరిపాలన లో రైల్వే అభివృద్ధి ఎలా జరిగిందో భీమవరం ప్రజలే చెప్పాలన్నారు. అల్లూరి ఉత్సవాలు ఏడాది పాటు దేశం అంతా నిర్వహిస్తామన్నారు. మోగల్లు లో అల్లూరి మెమరీ భవనం నిర్మిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం ఉంటుందని ప్రస్తుతం 400 కోట్లతో విశాఖ రైల్వే అభివృద్ధి జరుగుతోందన్నారు రాష్ట్రానికి మూడు కేంద్రీయ యూనివర్సిటీ లు కేంద్రం ఇచ్చి న విషయం మురళీ ధరన్ ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషేను రాజు జిల్లా కేంద్రం భీమవరం కు సీఎం జగన్ తో పాటు కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞలు తెలుపుతూ భీమవరంలో ఆధునిక ఫ్లై ఓవర్ బ్రీజ్ ల నిర్మాణానికి, కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. ఎంపి Gvl.నరశింహరావు , సోము వీర్రాజు తదితరులు మాట్లాడారు. స్థానిక ఆటో డ్రైవర్స్ కేంద్ర మంత్రికి కృతజ్ఞతగా సన్మానం చేసారు.
