సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన తప్పిదానికి ప్రాయశ్చిత్తంగా భీమవరం జెపి రోడ్డులోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలు, ఓం నమో వేంకటేశాయ (108 సార్లు) పారాయణం నిర్వహించారు. ముందుగా మంతెన రామ్ కుమార్ రాజు,వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలని, ధర్మ పరిరక్షణలో మనమంతా ఏకమవుదామని అన్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ముక్త కంఠంతో విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద నామాలు, ఓం నమో వేంకటేశాయ (108 సార్లు) పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ మూర్తి, బొండా రాంబాబు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, మనేపల్లి వెంక్కన్న బాబు, విశ్వ హిందూ పరిషత్ మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
