సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మున్సిపాలిటీ ఉద్యొగుల ఆధ్వర్యంలో నేడు, ఆదివారం ఉదయం చేపల మార్కెట్ మొదలు కొని పలు ప్రాంతాలను పరిశుభ్రం చేసి ముగ్గు చల్లారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో భాగంగా భీమవరం గునుపూడి మరియు JP రోడ్ హోటల్ అభిరుచి వద్ద నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య శ్రమ దానం కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు , అయన మొదటగా గునుపూడి లోని Dr. B. R. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు. రోడ్డులు చీపురుతో శుభ్రం చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పై యువత ఉత్సహంగా పని చెయ్యాలని, చెత్త తొలగించడానికి సిగ్గుపడకూడదని అది మనందరి బాధ్యత అని మన ఆరోగ్యం శుభ్రత పైనే ఆధారపడి ఉందనే విషయం గుర్తు ఉంచుకోవాలని .. పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. మొదటగా గునుపూడి లోని Dr. B. R. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు.
