సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగ భీమవరం ప్రధాన సెంటర్ అంబేద్కర్ చౌక్ సెంటర్ ను కూడా సుందరీకరణ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎస్ .శివరామకృష్ణ తెలిపారు.ఈ పనుల్లో భాగంగా ప్రస్తుతం ఈ చౌక్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నేడు, ఆదివారం జాగ్రత్తగా తొలగించి విజయలక్ష్మి థియేటర్స్ వైపు 38వ వార్డులోని లంకపేటలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలోకి మార్పు చేయడం జరిగిందన్నారు. అంబేద్కర్ చౌక్ లో అదే స్థానంలో తిరిగి నూతనంగా భారీ కాంస్య విగ్రహాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ రెన్యువేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.
