సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ఘనంగా శ్రీ సుబ్రమణ్య షష్ఠి ఉత్సవాలు నేడు, ప్రారంభమయ్యాయి. దానితో పాటు భీమవరం పట్టణంలో శ్రీరాంపురం లో శ్రీ రామలింగేస్వర స్వామి దేవాలయం పునర్ నిర్మాణం నేపథ్యంలో ఉత్సవాలు చెయ్యడం లేదు. అయితే నేడు, శనివారం ఉదయం నుండి విశేషంగా భక్తులు శ్రీ వల్లీదేవసేన సుబ్రమణేశ్వర స్వామిని వేలాదిగా భక్తులు దర్శించు కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు దేవాలయాలతో పాటు స్థానిక వన్ టౌన్ లోని శ్రీ బీమేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో వేలాదిగా భక్తుల సందడి భారీగా పెరిగింది. ( ఫై చిత్రంలో చూడవచ్చు) విశిష్ట పుష్ప అలంకరణలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసారు. భక్తులుకు వేగంగా దర్శనాలకు ఇబ్బంది లేకుండా తగిన దేవాలయ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేసారు. మారుతి సెంటర్ లోని సాయి బాబా ఆలయం వద్ద భారీ భక్త సందోహం షష్ఠి పూజలు నిర్వహించారు.పాలు పూలు తో అభిషేకాలు, వెండి పడగలు సమర్పణలతో దేవాలయాలు ఆధ్యాత్మిక శోభ తో కళకళ లడాయి.
