సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం తో పాటు తనకు పిలుపు వచ్చిన ప్రతి శుభ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి, గూడూరి ఉమాబాల జగదీష్ దంపతులు అలుపు సొలుపూ లేకుండా పాల్గొంటున్నారు. పవిత్ర ఏకాదశి పర్వదినం నేపథ్యంలో నేటి బుధవారం ఉదయం భీమవరం మండలం యనమదుర్రు గ్రామం చాగంటి శంకర శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారామలయ ధ్వజస్థంభ ప్రతిష్టపన కార్యక్రమంలో ( పైచిత్రంలో చూడవచ్చు)గూడూరి ఉమాబాల మరియు ఆమె భర్త జగదీష్ పాల్గొని ప్రత్యక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ యం. విజయ్, భక్తులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఈడూరు గ్రామలోని శ్రీ పట్టాభి సీతరామ నూతన ఆలయ ప్రారంభం మరియు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గూడూరి ఉమాబాల దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ వారు, నాయకులు, అభిమానులు, భక్తులు పాల్గొని విజయవంతం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *