సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు రేపటి బుధవారం నుండి ప్రారంభిస్తున్నారు. షష్ఠి ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలో మహిమానీతంగా భావించే, భీమవరం శ్రీరామపురం శ్రీ రామలింగేశ్వర స్వామి గుడిలోనూ మరియు అత్తిలిలో జరిగే ఉత్సవాలు. మరియు భారీ తీర్ధం తిరునాళ్ళు.. లైటింగ్, సెట్టింగ్స్, సాంసృతిక కార్యక్రమాలు రధోత్సవం.. తెపోత్సవాలు.. పల్లకి సేవలు .. భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఏటా అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. నాగదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, ఇలా ఎందరో స్వామిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహిస్తే తమ సమస్యలు తీరతాయని విశ్వసిస్తారు. శతాబ్దంపైగా చరిత్ర ఉన్న భీమవరం శ్రీరామపురం, అత్తిలి షష్ఠి ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. షష్ఠి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసారు. పోలీసులు భద్రతా ఏర్పాట్లు పికీటింగ్ లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు మాస్క్లు ధరించి ఉత్సవాలలో పాల్గొనడం తప్పనిసరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *