సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పుణ్య భూమి.. ఇక్కడ ప్రతిరోజూ ఏదొక చోట కారణం ఏదయినా సరే.. అన్నసమారాధన జరుగుతుంది. ఇక నేడు ఆదివారం అయితే పలు దేవాలయాలతో పాటు, పకృతి ఆశ్రమంలో, శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం వద్ద దాతల సహకారంతో పంచభక్ష పరమాన్నాలతో వేలాది భక్తులకు కార్తీక వన సమారాధనలు భారీ ఎత్తున జరిగాయి. ఇక సాక్షత్తు చంద్ర ప్రతిష్ట గా భావించే ‘పంచారామ’ సోమేశ్వర ఆలయం వద్ద స్థానిక భక్తులు, దాతల సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపి పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ముందుగా మహా నివేదనకు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. వన సమారాధనలు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగి ఉంటాయన్నారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని భోజనాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈవో, రామకృష్ణంరాజు చైర్మన్, చింతలపాటి బంగారు రాజు పాలకవర్గ సభ్యులు, కారుమూరి సత్యనారాయణ , ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *