సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో డి మార్డ్ ప్రక్కన స్థలంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాల వేసుకొన్న వందలాది స్వాములకు ఈ దీక్షలా కాలంలో ప్రతి రోజు స్వాములు నిష్ఠగా తయారు చేసిన బిక్ష భోజనం దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో నేడు, శుక్రవారం వైసిపి పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య ఆయన సతీమణి నాగ పుష్ప పుట్టినరోజు సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యం గురుస్వామి పీఠంలో స్వాములకు బిక్షను ఏర్పాటుకు సహకరించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ..,సమాజంలో ప్రతి ఒక్కరు భక్తి భావంతో ఉన్నప్పుడే శాంతి నెలకొంటుందని, ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలను ధరించి అయ్యప్ప స్వామికి పూజలు చేస్తూ భక్తి భావంతో సమాజానికి మేలు జరిగేలా పూజలు చేస్తున్న ప్రతి ఒక్క స్వామికి, ప్రతి ఒక్క భవానికి ‌ చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలోమాదిరెడ్డి శ్రీనివాస్, కొండా ఉదయబాలాజీ, అనిశెట్టి మురళికృష్ణ, తోటరామకృష్ణ, కొల్లి హరిబాబు, నల్లవీర భద్రరావు, సుబ్రహ్మణ్యం, సరిపడకల వెంకటేశ్వరరావు, భీమనాధం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *