సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మీదుగా నర్సాపురం నుండి తిరువణ్ణామలై (అరుణాచలం) స్పెషల్ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ను కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ నేడు, బుధవారం నరసాపురం లో ప్రారంభించి స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో కల్సి అందులో భీమవరం వరకు ప్రయాణించి వివిధ కోచ్ లలో ప్రయాణికుల అభిప్రాయాలు వారి అనుభూతులు అడిగి తెలుసుకొన్నారు. ప్రయాణికులు సుదీర్ఘ కాలంగా ఉన్న తమ కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేసారు. త్వరలో ఈ రైలు వారానికి మూడు సార్లు నడిచే విధంగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి వారికీ హామీ ఇచ్చారు. నరసాపురం, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కు ఘనస్వాగతం పలికారు. రైలు భీమవరం చేరుకున్న సందర్భంగా కూటమి నేతలు ,భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు,ఛాంబర్ ఆఫ్ కామర్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కేంద్ర మంత్రి కి స్వాగతం పలికి అరుణాచలానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ.. తిరువణ్ణామలై ప్రత్యేక రైలు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అరుణాచలం, తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడుతుందని, జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి గిరి ప్రదర్శన చేయాలని హిందూ భక్తులు కోరుకుంటారని అలాంటి వారికి ఇప్పటివరకు అరుణాచలం వెళ్ళటానికి మన రాష్ట్రం నుండి డైరెక్ట్ గా రైలు సౌకర్యం కల్పించాలని అనేకసార్లు రైల్వే ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేయగా వారు మొదట అంగీకరించలేదని ప్రయోగాత్మకంగా మూడు నెలలపాటు స్పెషల్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా నడపాలని తాను విజ్ఞప్తి చేయడంతో వారు అంగీకరించాలన్నారు. ప్రయాణికుల నుండి వస్తున్న డిమాండ్ ను చూసి రైలు సర్వీసు వారానికి 3 సార్లు కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ రైలు ఉభయగోదావరి జిల్లాలతో పాటుగా కోస్తా జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
