సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 24వ వార్డులోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ్‌ నారీ – సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ లో భాగంగా నేడు, శనివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. స్వస్థ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మహిళల ఆరోగ్యం కోసమేనని, ఈ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలను మహిళలు వినియోగించుకోవాలని, మహిళలకు బీపీ, షుగర్ , స్క్రీనింగ్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తారని, అనీమియా పరీక్షలు నిర్వహించడంతోపాటు తగిన కౌన్సెలింగ్ కూడా అందిస్తారన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్ ఛార్జ్ యర్రా నాని, వైద్యులు నాయుడు, డా దివ్య, డా బద్దె రామకృష్ణ, డా లత, ఎఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్, జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, రామాయణం శ్రీను, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, తదితర కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *