సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన గజపతినగరం ఎమ్మెల్యే, రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. రాష్ట్రమంత్రి శ్రీనివాస్ భీమవరం అల్లుడు కావడం ఎంతో సంతోషకరమని, రానున్న రోజుల్లో అత్తవారిల్లు అయిన భీమవరం అభివృద్ధికి కృషి చేయాలనీ ఆయనను క్లబ్ సభ్యులు కోరారు. అనంతరం క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, వెస్ట్ బెర్రీ డైరెక్టర్ నడింపల్లి మహేష్ తదితరులు మంత్రి శ్రీనివాస్ ను సత్కరించారు.
