సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 2 టౌన్ ఏ ఎస్ ఆర్ నగర్ లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం స్థలం లీజు అనుకున్న ప్రకారం 25 ఏళ్ళు పూర్తీ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక మునిసిపల్ స్థలంలో నెలకు 6 వేలు మునిసిపాలిటికి అద్దె చెల్లించే విధంగా అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మించారు. ఎన్నో కార్యక్రమాలు పంక్షన్స్ తో కళకళ లాడే అల్లూరి సీతారామరాజు సాంస్కృతి క కేంద్రానికి మునిసిపల్‌ పరిపాలన శాఖ లీజును రద్దు చేస్తూ మునిసిపాలిటీకి ఉత్తర్వులు జారీచేసింది. కారణాలు ఏవైనా సుమారు గత 10 ఏళ్లుగా భీమవరంలో మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరగక పోవడంతో కౌన్సిల్ కూడా లేకపోవడం దీనిపై నిర్ణయం ఆలస్యం అవుతుంది. దీనితో కేంద్రం నిర్వాహకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దృష్టికి తీసుకు వెళ్లారు.ఆయన దీనిని అతిత్వరలోనే పరిష్కరించి లీజు ను పునరుద్ధరింప చేస్తారని నిర్వాహకులు ఆశాభావంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *