సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గత ఆదివారం రాత్రి శాసన మండలి చైర్మన్ వారి క్యాంప్ కార్యాలయం శాసన మండలి ఛైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్య సంఘాల వారి ఆత్మీయ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు సభాపతి, శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి ధర్మకర్తల కమిటీ చైర్మన్, మానేపల్లి నాగన్న బాబు,మాజీ ఛాంబర్ అద్యక్షులు మానేపల్లి గుప్తా, వబిలిశేట్టి రామ కృష్ణ,తటవర్తి బదిరి, కురుశెట్టి కాశీ తదితర ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు , YSRCP రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు,మేడిది జాన్సన్ , మరియు నర్సాపురం ఎంపీ వైసీపీ అభ్యర్థి ఉమా బాల గారి భర్త గూడూరి జగదీశ్ ,గొల్లవానితిప్ప మాజీ సర్పంచ్ ,బోకూరి విజయ రాజు మాజీ కౌన్సిలర్ శ్రీ రాజా బాల మస్తానయ్య , YSRCP జిల్లా సేవాదళ్ అధ్యక్షుల,బలే ఏసు బాబు పాలపర్తి జోనా పాల్గొన్నారు. సందర్భముగా, కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *