సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం 2వ పట్టణం శివారు ప్రాంతం బలుసుమూడి రోడ్డు,కలుపుతూ కొమరాడ గ్రామానికి వెళ్లే రోడ్డు మలుపు వద్ద ఏర్పడ్డ పెద్ద గొయ్యి వద్ద రోజు పలువురు వాహనదారులు ప్రమాదాల బారి పడుతున్నారు, పలువురికి గాయాలు అవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఎందుచేతనో స్వాందించడం లేదని స్థానికులు పిర్యాదు చేస్తున్నారు. ( మాజీ ఎంపీ తోటసీతారామలక్ష్మి నివాసం కూడా అక్కడికి సమీపంలోనే ఉంది). నిజానికి బలుసుమూడి , కొమరాడ రోడ్డులు ఎన్నో ఏళ్లుగా గుంతలతో బాగా దెబ్బతిన్నప్పటికీ కీలకమైన వినాయకుడి గుడి దగర వై జంక్షన్ మలుపు వల్ల రోజు అటువైపు నుండి వెళ్లే స్కూల్, ఆదిత్య jr. కాలేజీ బస్సులు, ఆక్వా కంపెనీ లారీలు, వాహనాలు మలుపులో గుద్దుకోవడం, గుంటలో కురుకొనిపోవడం వల్ల పలుమారులు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం జరుగుతుంది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లే ఆ మలుపులో రాత్రిళ్ళు అయితే వాహనదారుల పరిస్థితి ఊహించలేము. కాబ్బటి సంబంధిత అధికారులు వెంటనే స్వాందించి భవిషత్తు లో అక్కడ తీవ్ర ప్రమాదాలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన గొయ్యి పూడ్చి, రోడ్డు రిపేరు చేయించవలసిన అవసరం ఉంది.
