సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల రొయ్యల ఎగుమతుల కొనుగోళ్లు రేటు తగ్గిపోవడం తో , రొయ్య, చేపల మెతలు ధరలు భారీగా పెరిగిపోవడంతో భీమవరం జోన్ లోని ఆక్వా రైతుల పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్ర మంత్రులతో పాటు ఆక్వా రంగంలోని అన్ని వర్గాలవారి ప్రతినిధులతో తరపున ఒక కమిటీ ఏర్పాటు చేసి గత 2 నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆక్వా రంగానికి కొంత ఉపశమనం కలిగింది. అయితే రొయ్య లకు పలు రకాల కౌంట్లకు కనీస ధర నిర్ణయించినట్లు దాని ప్రకారం ఒక 10 రోజులు ఎగుమతిదారులు కొనుగోలు జరిగిన తదుపరి క్షేత్రస్థాయిలో ఆ మేరకు కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆందోళన వ్య క్తం చేస్తూనే ఉన్నారు. అలాగే కమిటీ ఏర్పాటు తర్వాత మేతల ధరలు మాత్రం అదుపులోకి వచ్చాయి ఇక ఎన్ని ఎకరాలలో పంట పండించిన కీలకమైన విద్యుత్తు రాయితీ అందరికి ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్ ఫై మాత్రం స్పష్టత లేదు. ఈ పరిస్థితుల నేపథ్యం లో కోస్తా జిల్లాల ఆక్వా సాగుదారుల ప్రతినిధులు భీమవరం సమీపంలోని ఉండి రోడ్డు లోని ఒక పంక్షన్ హాలులో సమావేశం అయ్యారు. దీనిలో భీమవరం లో ఆక్వా ప్రముఖులు, రైతులు ఇంకా గోదావరి జిల్లాల నుంచి రైతు ప్రతినిధులు, ఎగుమతిదారులు, మేతలు, ఆక్వా వ్యవసాయ మందుల తయారీ సంస్థలు, హేచరీల ప్రతినిధులతో పాటు ఆక్వా రంగ ప్రముఖుడు, రాజ్యసభ సభ్యు డు బీద మస్తాన్రావు, ఎంపెడా వైస్ ఛైర్మన్ వడ్డె రఘురాం చర్చలు జరుపుతున్నారు. నేటి సాయంత్రానికి అందరు సమన్వయంతో కీలక నిర్ణయాలు తీసుకోని..ముఖ్యంగా విద్యుత్ రాయితీలపై.. వాటి అమలుకు ప్రభుత్వ ఆమోదానికి కృషి చేస్తారని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *