సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం మంత్రి నారా లోకేష్ . కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు,స్థానిక ఎమ్మెల్యేలు రఘురామా, అంజిబాబు లతో కల్సి ఉండి, భీమవరం నియోజకవర్గాలలో పర్యటించారు. భీమవరం ఉండి లింక్ రోడ్డు పనులకు కు శంకుస్థాపన చేసారు. పెద్దమిరంలో స్వర్గీయ రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కారించారు.ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోరాట పటిమతో ఫైర్ బ్యాండ్ అని, రతన్ టాటా విగ్రహం ఆవిష్కరణకు ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తీసుకున్న చొరవ అభినందనీయమని అన్నారు. స్థానిక ప్రభుత్వ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. రాబోయే మూడు నెలల్లో విశాఖలో టాటా గ్రూప్ కు చెందిన టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్‌ను తీసుకు రాబోతున్నామని, విద్య వ్యవస్థ పారదర్శకంగా మారుస్తున్నామని, పాఠ్య పుస్తకాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు లేవు పార్టీల రంగులు లేవు, తమకు ఆ పిచ్చి లేదని అన్నారు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పదివేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్‌ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని తెలిపారు.హైదరాబాద్‌లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ.25 కోట్లు, హుద్ హుద్ తుపాను సమయంలో మూడు కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా అని గుర్తుచేశారు. భీమవరంలో ని SRKR ఇంజినీరింగ్ కాలేజీలో సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. .
