సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తుపాను ప్రభావం లేకపోవడం తో పాటు, గత 3 రోజులుగా ఎండలు మండుతుండటంతో ధాన్యం రైతులు పెద్ద గండం నుండి బయట పడుతున్నారు.. భీమవరం, ఉండి పరిసర డెల్టా ప్రాంతాల్లో రైతులు పొలాలలో బంగారంలా విరగపండిన వరి పంటను ఆధునిక కోత యంత్రాలతో కొయ్యడం,చెమ్మ లేకుండా పూర్తిగా ఆరిపోయిన ధాన్యం ను బస్తాలలోకి ఎట్టి శరవేగంగా అమ్మకాలకు తరలిస్తున్న హడావిడి కనిపిస్తుంది. ఈసారి డెల్టా లో రికార్డుస్థాయి పంట అమ్మకాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భముగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు రైతు భరోసా కేంద్రాలఫై, రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలపై ప్రచారంలో ఉన్న అపోహలు రైతులు నమ్మవద్దని, ప్రభుత్వ ఆదేశాలతో..ధాన్యం సొమ్ములు నిర్ణీత సమయంలో రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశామని, రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడిన తనకు పిర్యాదు చేయాలన్నారు. గొనె సంచులు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. రైస్ మిల్లులో సీసీ కెమోరాలు తప్పనిసరిగా వాడాలి అన్నారు.
