సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పిలుపు మేరకు నేడు,సోమవారం ఉదయం భీమవరం మండలం మరియు టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా సుమారు 1000 పైగా బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ జెండాలతో పాటు .. పెత్తందార్లతో పేదలకోసం జగన్ యుద్ధం.. కార్టూన్ మినీ ఫ్లక్సీలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం గౌరవంగా తలెత్తుకుని జీవించేలా అందరికీ ఇల్లు అందించే కార్యక్రమం చేపట్టింది. రాజధాని ప్రాంతంలోని నిరుపేదలకు కూడా అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ళ పట్టాలు పంపిణీ చేసింది.అయితే టీడీపీ అధినేత చంద్రబాబు,పేదల ఇళ్ల స్థలాలను శవాలను పూడ్చడానికి సెంటు స్థలం అంటూ.. పేదల ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చి దారుణంగా అవమానిస్తూ .మాట్లాడటాన్ని ఖండిస్తున్నాము అన్నారు. ఇక భీమవరం శివారు పెద్ద మిరం వైసీపీ కార్యాలయం నుండి డీసీసీబి చైర్మెన్ పివిఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ , ఆకివీడు, ఐ భీమవరం, ఉండి తదితర ప్రాంతాల మీదుగా తిరిగి పెదమిరం చేరుకొని వైసిపి నేతలు భారీ బైకు ర్యాలీ ని నిర్వహించి టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ను హీనంగా చూసే వైఖరి మార్చుకోవాలని నినాదాలు చేసారు.
