సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేడు, బుధవారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) ను వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీనివాస్ కు ఎమ్మెల్యే అంజిబాబు, వారి కుమారుడు ప్రశాంత్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు లు సత్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. భీమవరం రావడం ఆనందంగా ఉందని, ఇదే ప్రాంతంలో అల్లుడైనందుకు సంతోషిస్తున్నానని, ఈ ప్రాంత అభివృద్ధికి కలిసి పని చేద్దామని అన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారు ఎంతో ప్రాముఖ్యత గల దేవత అని, బంగారు చీర పూర్తి చేయడానికి ఏర్పాట్లు జరుగుతాయని, మంత్రిగా మీ సహకారం అవసరమని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. తదుపరి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)లు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్, కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, సరిపిడకల రామారావు, గంటా త్రిమూర్తులు, మద్ధుల రాము, రెడ్డి సత్తిబాబు, కొప్పినిడి శ్రీను, చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
