సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో వైసిపి ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా.. భీమవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో 13వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో నేడు, ఆదివారం వైసిపి కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఆధ్వర్యంలో స్వర్గీయ YS విగ్రహానికి పుష్పాభిషేకం చేసి తదుపరి వైసిపి పార్టీ జెండా వందనం కేకు కోసి, మిఠాయిల పంపిణీలతో స్థానిక నేతలు , కార్యకర్తలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వై యస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధన కొనసాగింపు గా వై ఎస్ జగన్ నేతృత్వంలో గత 13 ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీ ప్రస్థానం అపూర్వమని, ఎన్ని అడ్డంకులు వచ్చిన, టీడీపీ తదితర పార్టీ లు ఎన్ని కుట్రలు చేసిన.. సాహసోపేతంగా తాను ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ చేస్తున్న పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం గా నిలిచిపోతుందని, ఆయన ఇస్తున్న సంక్షేమ ఫలాలు, చేస్తున్న అభివృద్ధి వైసిపి ప్రతి కార్యకర్త జనంలోకి, ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు.
