సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కార్యాలయంలో స్థానిక ప్రజానీకానికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. తెలియజేసారు, సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీక గా వారి రక్షణ కోసం నిర్వహించే ఈ పండుగ సంప్రదాయంలో ఇంత మంది సోదరీ మణులకు.. తాను సోదరుడిగా భాగం అయ్యినందుకు సంతోషంగా ఉందని .. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాని అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు, వైసిపి పార్టీ మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టడం జరిగింది.వారికీ మిఠాయిలు పంపిణి జరిగింది. ప్రతి ఏడాది లానే ఈ రోజు కూడా రాఖీ పౌర్ణమి సందర్బంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను తమ సోదరుడు గా భావిస్తూ విశేషంగా బ్రహ్మకుమారిలు హాజరయి ఆయన క్షేమాన్ని కాంక్షింస్తూ ఆయన చేతికి రాఖీలు కట్టడం జరిగింది.
