సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 34 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి రూ 27,15,924 చెక్కులను ఎమ్మెల్యే,పులపర్తి అంజిబాబు అందించారు. ఇప్పటి వరకు మన నియోజకవర్గ పరిధిలో 35వ విడతలో 576 మంది లబ్ధిదారులకు రూ 4,79,82,045 లను అందించడం జరిగిందన్నారు. వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాజకీయ , పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *