సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో మాజీ మునిసిపల్ చైర్మెన్ గ్రంధి వెంకటేశ్వర రావు మృతికి సీఎం జగన్ నుండి స్థానికుల వరకు సంతాపాలు కొనసాగుతున్నాయి. నిన్న స్వచ్చంధంగా భీమవరం మార్కెట్ బంద్ కాగా.. లూథరన్ హైస్కూల్ లో భారీగా ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కూడా గత న రాత్రి ఎగ్జిబిషన్ రద్దు చేసి సంతాపం తెలిపారు. ఇక నేడు బుధవారం పట్టణంలో కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరవకుండా సంతాపం ప్రకటించారు. నేడు, బుధవారం ఉదయం జివిఆర్ అంతిమయాత్రలో, ఆయన కుమారుడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు, మంత్రి పేర్ని నాని, పరామర్శించగా తదుపరి. స్థానిక భీమవరం, ఉండి నియోజికవర్గాల ప్రముఖులు, ప్రజా ప్రతినిధులతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి పలువురు ఎమ్మెల్యేలు గ్రంధి నివాసానికి వచ్చి పరామర్శించడం జరిగింది. నరసాపురం నుండి ప్రసాదరాజు, తాడేపల్లి గూడెం నుండి కొట్టు సత్యనారాయణ, రాజోలు నుండి రాపాక వర ప్రసాద్ తదితరులు వరుసగా వస్తూ గ్రంధి వెంకటేశ్వర రావు తో తమ అనుబంధం నెమరువేసుకొంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు పరామర్శిస్తూ గ్రంధి కుటుంబ సబ్యులకు సంఘీభావం తెలపడం కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *