సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విఫ్, భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కార్యాలయం వద్ద నేటి, ఉదయం 7గంటల నుండి ప్రజలు, ప్రభుత్వ ఉద్యొగులు. అధికారులు,వేలాది మంది అభిమానులు, వైసిపి క్యాడర్ లతో భారీ సందడి నెలకొంది. నిజానికి గత 3 దశాబ్దాల నుండి గ్రంధి వారి ఇంట రాజకీయాలకు అతీతంగా, ఆయన తండ్రి స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు భీమవరం చైర్ పర్సన్ గా చేస్తున్నప్పటి నుండి ఒక సంప్రదాయం’గా వారి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ సందడి ప్రతి నూతన ఏడాది కొనసాగుతూనే ఉంది. నేటి మధ్యాహ్నం 12గం. దాటిన ఎడతెగని ప్రజలు క్యూ లైన్ లో నిలబడి గ్రంధి శ్రీనివాస్ ను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు దశలలో ఆయన ఆఫీస్ రూంలో దూసుకొని వస్తున్నా అభిమానుల తాకిడికి పలుసారులు ఆయన కూడా తట్టుకోలేక పోయారు. దానితో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అందరిని సముదాయిస్తూ ఆఫీస్ బయటకు వచ్చి ఆవరణలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ లను కోసి అభిమానులకు పంచారు. తదుపరి భారీ టెంట్ క్రింద నిలబడి ప్రతి ఒక్కరిని ఓపికతో చిరునవ్వుతో పలకరిస్తూ వారి శుభాకాంక్షలు అందుకోవడం జరిగింది. మన సిగ్మా వీక్షకుల కోసం 2024 కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. ( ఫై తాజా చిత్రంలో )నియోజక వర్గ ప్రజలు సుఖశాంతులతో 2024 లో మరింత అభివృద్ధి సాధించాలని , సీఎం జగన్ సహకారంతో తనవంతు కృషి చేస్తానని MLA గ్రంధి శ్రీనివాస్ సిగ్మా న్యూస్ తో అన్నారు..వచ్చిన వేలాది మందికి షమియానా టెంట్లలో టిఫిన్, భోజన ఏర్పాట్లు చేసారు. గ్రంధి శ్రీనివాస్ కుమారుడు గ్రంధి రవితేజ వచ్చిన నేతలను, కార్యకర్తలను పలకరిస్తూ సందడిగా గడిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *