సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, అయన కుమారుడు ప్రశాంత్ ఫై వారి అనుచర వర్గాలకు మద్యం ,పేకాట, సిఫార్స్ లేఖలపై,సినిమా టికెట్స్, సైతం దందాలు నడుపుతున్నారని పలు అవినీతి ఆరోపణలు చేస్తూ అది భీమవరం పబ్లిక్ టాక్ అంటూ ఒక ప్రముఖ శాటిలైట్ న్యూస్ ఛానెల్ చేసిన ప్రసారాలపై.. భీమవరం లోని క్లబ్స్ నిర్వాహకులు ఈ వార్తలు ను తాము ఖండిస్తున్నామని అన్నారు. స్థానిక కాస్మో క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భీమవరంలోని 3 ప్రముఖ క్లబ్ ల పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల ఒక ఛానెల్ లో ఎమ్మెల్యే అంజిబాబు వంటి నిస్వార్ధపరుడి ఫై వచ్చిన వార్తలు నిజం కాదని , ఆయనకు మూడు క్లబ్ ల నుండి లక్షల రూపాయలు డబ్బు అందుతుందని ఎవరి పొద్భలంతో,లెక్కలతో సహా ఎదో ఆధారాలతో పట్టేసుకున్నట్లు ఈ వార్త వేసారో తెలియడం లేదని, నిజానికి అంజిబాబు గారు ఎప్పుడు తాము మా క్లబ్ సభ్యుల సహకారంతో చేస్తున్న సమాజ సేవకు, నిర్మాణాలకు , క్రీడా ఛాంపియన్స్ పోటీలకు స్థానిక ఎమెల్య గా ప్రోత్సహకారంగా ఉంటారు తప్ప, ఎప్పుడు వారి కోసం అడిగింది లేదని అన్నారు. నిజానికి భీమవరంలో ఎవరు ఎమ్మెల్యే అయినా తమ క్లబ్ లు అన్ని అనుమతులతో ఉంటాయి కాబ్బటి ఎవరికీ భయపడి ఎందుకు డబ్బులు ఇస్తామని? ప్రశ్నించారు.
