సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించడంలో భాగంగా భీమవరం ఏరియా ఆసుపత్రి,, నరసాపురం ఏరియా ఆసుపత్రి తణుకు జిల్లా ఆసుపత్రి, మొదలగు చోట్ల మెడికల్ ఆఫీసర్ల కు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు, ఏఎన్ఎం లకు శిక్షణ తరగతులు మూడు రోజులపాటు నిర్వహించడం ద్వారా ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించి తద్వారా వ్యాధి సంక్రమణ పడ్డ వారిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం వాటి గురించిన శిక్షణ తరగతులను రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ వారు ప్రత్యేకమైన నోడల్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నరేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు గారు, జిల్లా ప్రోగ్రాం మోనిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ ధనలక్ష్మి , భీమవరం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మాధవి కళ్యాణి, శిక్షణ అధికారులు డాక్టర్ గులాబ్ రాజ్ కుమార్, డాక్టర్ సింది ఆనంద్ , డాక్టర్ అబ్దుల్ హమీద్ మరియు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ శిక్షణా కార్యక్రమాలు మూడు రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *