సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఏలూరులో బీజేపీ నేతలు పాకిస్తాన్ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్తాన్ అనుచిత వ్యాక్యలు మానుకోవాలని నినాదాలు , ప్లే కార్డ్స్ ప్రదర్శించారు. భీమవరం ప్రకాశం సెంటర్ లో నేటి శనివారం సాయంత్రం స్థానిక పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ నేతలు ఉగ్రవాద దేశం పాకిస్తాన్ నీతులు చెప్పటం ఆపాలని నినాదాలు చేస్తూ పాక్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఏలూరు జిల్లా బిజెపి జిల్లా కార్యాలయం సమీపంలోని అశోక స్తంభం వద్ద జిల్లా బిజెపి ఆధ్వర్యంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేసి పాక్ మంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి చౌదరి ( తపన) మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలన కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని అది జీర్ణించుకోలేక పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏలూరు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రసాద్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపా శోభారాణి,తదితరులు పాల్గొన్నారు.
