సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. భీమవరంలో లక్ష ఓట్లు ఉంటె తనను ఓడించడానికి వైసిపి వాళ్ళు 8వేల ఓట్లు అదనముగా కలిపారని మాట్లాడటం హాస్యస్వాదం అని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేసారు. భీమవరంలో జరిగిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలో ఏం జరుగుతుందో విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. కాస్త కూడా లెక్కలు తెలియకుండా పార్టీలు పెట్టి విద్య కోసం, పేదల కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ ముందుగా లెక్కలు తెలుసుకోవాలని, భీమవరం నియోజకవర్గంలో 2 లక్షల 46 వేలమందితో ఓటర్ల లిస్ట్ ఉంటే కేవలం లక్ష ఓట్లు మాత్రమే ఉన్నాయని, గెలుపు కోసం అదనంగా 8 వేలు దొంగ ఓట్లు, రిగ్గింగ్ చేశారని పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యస్వాదం అన్నారు. ఆయనకు లెక్కలు తెలియవు .పవన్ కళ్యాణ్ ను ఇప్పడు ఎల్ కె జి లో చేర్పించడానికి ఆయన వయస్సు 3 సంవత్సరాలు కాదని, 50 దాటిపోయింది కాబ్బటి నిబంధన ప్రకారం ఎల్ కేజీలో పవన్ కు సీటు రాదు కాబట్టి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రికమెండ్ చేసి ఎల్ కె జి లో పవన్ కు సీటు ఇప్పించాలని కోరుతాను అన్నారు. నాకో లెక్కుంది, దానికో తిక్కుంది అంటున్న పవన్ లక్ష ఓట్లు ఉంటే లక్షా 8 వేలు ఓట్లు పోలయ్యాయని, వంద మార్కులు ఉంటే 120 మార్కులు వేస్తామని మాట్లాడడమేనా? అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. నీకెందుకయ్య రాజకీయ పార్టీ, పిల్లలు చెడిపోతున్నారు అని విమర్శించారు.
