సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో భీమవరంలో వైసిపి వారి 10 వేల ఓట్లు ఉన్నాయని, వారిలో చాల మంది మరణించారని వాటిని పరిశీలించాలని కోరుతూ ఇచ్చి న జాబితా లో ఏకంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తల్లి , స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సహచర మిత్రుడు డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు, నాచు శేషగిరి రావు పేర్లు కూడా ఉన్నాయని .. టీడీపీ వారు ఈసీ కి ఇచ్చిన లిస్ట్ చూపిస్తూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ అంశంపై ఫై భీమవరం లో, టీడీపీ జిల్లా అధ్య క్షురాలు తోట సీతారామ లక్ష్మి నేడు, గురువారం స్వాందిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వైసిపి పార్టీ వారి ఆధ్వర్యంలో దొంగఓట్లు నమోదు అవుతున్నాయని ఆరోపణలు రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈసీ ని తమ అనుమానిత లిస్ట్ ఇచ్చినమాట వాస్తవమేనని అయితే అందులో భాగంగా భీమవరంలో జాబితాలో కొన్ని అనుమానిత పేర్లను పునఃపరిశీలించాలని పార్టీ కోరింది తప్ప జీవించి ఉన్న వారి పేర్లు తొలగించాలని ఎక్కడా కోరలేదు అన్నారు. నిజంగా ఓట్లు హక్కు ఉన్నవారి పేర్లు తొలగించాలని ఉద్దేశ్యంతో మేము ఎక్కడ డిమాండ్ చెయ్యలేదు అన్నారు.
